Total Lunar Eclipse 2025
శ్రీ గణేశాయ నమః - శ్రీ మాత్రే నమః - శుభ గ్రహ
కేతు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం
13.03.2025 రాత్రి,14.03.2025 నాడు ఉదయాత్పూర్వం సంభవించు సంపూర్ణ చంద్ర గ్రహణం:
శ్రీ క్రోధి నామ సం ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి, ఉత్తరా ఫల్గుణి నక్షత్ర యుక్త కేతు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం.
(ముఖ్య గమనిక: ఇట్టి గ్రహణం భారతదేశంలో కనబడదు)
ఇట్టి గ్రహణము ఐరోపా, ఐర్లాండ్, పోర్చుగల్, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, మెక్సికో, న్యూజిలాండ్, క్యూబా, అమెరికా దాదాపుగా అన్నీ ప్రాంతాలలో సంపూర్ణ గ్రహణాన్ని వీక్షించ వచ్చు. వీరికి గ్రహణ నియమాలు వర్తిస్తాయి . ఇట్టి గ్రహణం భారతదేశంలో కనిపించదు. కావున భారతదేశంలో నివసించు వారికి గ్రహణ పట్టింపు ఉండదు.
న్యూయార్క్ సమయం ప్రకారం:
గ్రహణ స్పర్శ కాలం 13.03.2025 రాత్రి 11:57
సంపూర్ణ గ్రహణారంభం: 14.03.2025 ఉదయాత్పూర్వం 02:26
సంపూర్ణ గ్రహణ అంతకాలం 14.03.2025 ఉదయాత్పూర్వం 03:31
గ్రహణ మోక్ష కాలం: 14.03.2025, 06:00
ఇట్టి గ్రహణాన్ని గ్రహణం కనిపించు ప్రాంతాలలో నివసించు సింహా, కన్యా, మకర, కుంభ మరియు మీన రాశుల వారు వీక్షించ రాదు. వీరు గ్రహణ శాంతి జరుపుకోవాలి.
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति
శ్రీ గాయత్రి వేద విజన్, హన్మకొండ